Tag Archive Polavaram

పోలవరం గురించి

@RanjithReddy
పోలవరం కాదు శాపం! (లోతుగా తెల్సుకోవాలనుకునే వారు ఇది చదవండి . అనవసరంగా తెలంగాణా వారి మీద పడి ఏడ్చే వాళ్ళు తప్పక చదవండి .)
-ప్రాజెక్టు కడితే 397 ఆదివాసీ గ్రామాలు జలసమాధే!
-ప్రకతి సంపద సర్వనాశనమేభద్రాద్రి రామయ్యకూ సంకటమే
-బ్రిటీష్ కాలంలోనే వద్దన్నారుమళ్లీ తెరపైకి వచ్చినా కుదరదన్నారు!
-మరి ఇప్పుడే ఎందుకు ముందుకు తెస్తున్నారు? నీటి రంగ నిపుణుల ఆగ్రహం
జలరంగనిపుణులు వద్దని వారించినా పట్టువీడకుండా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులేమైనా ఉన్నాయా..? అంటే, అందులో ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర, వివాదాస్పదంగా పేరొందిన ప్రాజె క్టు.. పోలవరం! బ్రిటీష్ హయాంనుంచి ఇప్పటివరకు ఎన్నో వివాదాల సుడిగుండాలను సష్టించిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విభజన పుణ్యమా అని జాతీయహోదా లభించింది. జాతీయ హోదా దేని కి..?
తెలంగాణలో ఆదివాసీల సంసతిని, మనుగడను ధ్వంసం చేయడానికా..?!
దిగువ ప్రాంతాలను వరద నీటితో ముంచి ప్రళ యం సష్టించడానికా..?!
పాపికొండల వంటి అపురూప అభయారణ్యాన్ని, అపార ప్రకతి సంపదను పూర్తిగా నాశనం చేయడానికా..?!
గోదావరి నదిలో వరద ఉధతి అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తోంది.
1850లో 15లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటే
1940 నాటికి అది 21లక్షలకు పెరిగింది.
1953లో 30లక్షల క్యూసెక్కులున్న వరద ప్రవాహం
1986లో 35లక్షలకు పెరిగింది. ఇప్పుడది 36లక్షల క్యూసెక్కులను దాటుతోంది. కానీ గోదావరి వరద ప్రవాహం ఎప్పుడైనా ప్రమాదకర స్థాయి 50లక్షల క్యూసెక్‌ల వరకు చేరుకోవచ్చని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలవనరుల సంఘం హెచ్చరించింది.
1953, 1986లో వచ్చిన గోదావరి వరదలు రాష్ర్టాన్ని వణికించాయి. 36లక్షల క్యూసెక్‌ల మేర నీరు ప్రవహించడంతో వరద నీరు భద్రాచలం గుడిని తాకింది. గత నాలుగు దశాబ్దాలలో మూడోసారి ఈ పరిస్థితి తలెత్తింది. ఎలాంటి అడ్డుకట్ట లేకుండానే ఈ పరిస్థితి తలెత్తింది. అంటే ఇక పోలవరం వద్ద 150అడుగులతో అడ్డుగా ఆనకట్ట నిర్మాణం పూర్తి చేస్తే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు!! గోదావరి వాలు భద్రాచలం నుంచి పోలవరం వరకు చాలా తీవ్రంగా ఉంటుంది. పోలవరానికి 125కిలో మీటర్ల దూరంలో నది భూతల మట్టం 32.5మీటర్ల ఎత్తులో ఉంటే పోలవరం వద్ద ఎకాఎకిన 3మీటర్లకు పడిపోయింది. ఏటవాలుకు వరద ఉధతి ఊహించని విధంగా ఉంటుంది. భద్రాచలం వద్ద 1200మీటర్ల వెడల్పు ఉన్న నది పాపికొండల వద్దకు రాగానే ఒక్కసారిగా 70మీటర్లకు తగ్గుతుంది. ఈ కారణంగా వరద ప్రవాహం దాదాపు 5 రెట్లు అధికమై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది.
అసలుకే ఎసరు:
వాస్తవానికి గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నప్పుడు ఆరుగంటల్లో జలాశయం పూర్తి మట్టం 150 అడుగులకు చేరుతుంది. అప్పటికే తెలంగాణలో రెండువందల గ్రామాలు నీట మునుగుతాయి.. కానీ 50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నప్పుడు కేవలం నాలుగుగంటలలోనే నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకుని ప్రమాదం ముంచుకు వస్తుంది
ప్రాంతీయ పరంగా కాకుండా మానవీయకోణంలో చూసినా ఇది అత్యంత ప్రమాదకరమని, పోలవరంలో మట్టికట్ట ఎత్తు 175 అడుగులు కాగా గేట్లపై మట్టం 150 అడుగులు. గేట్ల పూర్తి మట్టం, మట్టికట్ట మధ్య తేడా కేవలం 25 అడుగులే. జలాశయంలో ఏర్పడే అలలకు సరైన చోటివ్వడానికి 10 అడుగులు అవసరమవుతాయి. 15 అడుగుల వరద ఒరవడి 36 లక్షల నుంచి 50 లక్షల వరకు చేరితే 72 శతకోటి ఘనపుడటడుగుల నీరు గంటకు 13 శతకోటిఘనపుటడుగుల నుంచి 19 టీఎంసీల వరకు వరుసగా జలాశయంలో నిండుతుంది.
కానీ భౌగోళికంగా పోలవరం విషయంలో అలాంటి పరిస్థితి లేదు. గోదావరి వరద ఉధతికి నాలుగు గంటల్లోనే వరద నీరు నిండిపోవడం, మరో నాలుగు గంటల్లో వరద పొంగి మట్టికట్ట తెగిపోయే ప్రమాదం ఉంది .
కట్టతెగితే..?!:
ఒక వేళ కట్టతెగితే 40 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు పెద్ద ఎత్తున ఉప్పెన వచ్చే ప్రమాదముందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోలజీ రుర్కి ఇది వరకే హెచ్చరించింది. వరద ఉధతి 50 లక్షల క్యూసెక్కులను దాటే పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు పెను ప్రమాదం ఉంటుందని తేల్చింది. రాజమండ్రి, భీమవరం, కొవ్వూరు, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో భారీ ఆస్థి, ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోకెమికల్ కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు, సెజ్‌లకు ఉపయోగపడుతుంది తప్ప సామాన్యులకు కాదని మొదటి నుంచి బలమైన విమర్శలున్నాయి.
ఎందుకంటే పోలవరం ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందిచాలన్నది ప్రధాన లక్ష్యం. కానీ వివాదాల కారణంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండటంతో ప్రత్యామ్నాయంగా పుష్కర, తాటిపుడి, ఛగలనాడు, తురిగడ్డ ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. దీంతో దాదాపు ఐదులక్షల ఎకరాలకు నీరందుతోంది. ఇక మిగిలింది.. బహుళజాతి కంపెనీలు, సెజ్‌లు, సముద్రతీర ప్రాంతంలోని ఫార్మా, కెమికల్ కంపెనీలకు నీరందించటమే! ఇందుకోసం తెలంగాణ ఆదివాసీలను బలిపెట్టడంతో పాటు దిగువన ఉన్న వారిని కూడా ప్రమాదంలోకి నెట్టడానికి ఈ జాతీయ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. పోలవరం శాస్త్రీయంగా సాధ్యం కాదని పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు, శివాజీ లాంటి నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. 1751 నుంచి బ్రిటీష్ కాలంలో ప్రతిపాదన వచ్చింది.. కానీ అప్పుడే దూరదష్టితో వ్యవహరించారు. తగదని పక్కకు తప్పుకున్నారు. 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీలో మళ్లీ శ్రీరామపాదసాగర్ పేరిట తెరపైకి వచ్చింది. నాడు డాక్టర్ సావేజీతో పాటు కేఎల్ రావు కూడా సాధ్యంకాదని తేల్చారు.
భారీ విధ్వంసం తప్పదా?
పోలవరం రిజర్వాయర్ స్టోరేజీ కెపాసిటీ 194 టీఎంసీలు. అందులో 75 టీఎంసీలు లైవ్ స్టోరేజీ. స్పిల్ వే డిశ్చార్జి 36 లక్షల క్యూసెక్‌లు. వరద ఇన్‌ఫ్లో డిజైన్డ్ 49 లక్షల క్యూసెక్‌లని అంచనా వేశారు. ఈ ప్రాజెక్ట్ అదనంగా వచ్చే లాభం కంటే నష్టాలు, కష్టాలే ఎక్కువ. పోలవరం ఖమ్మం జిలాల్లోని పాల్వంచ, వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాలను ముంపునకు గురిచేస్తూ దాదాపు రెండున్నర లక్షల గిరిజన, ఆదివాసీలను నిరాశ్రయులను చేయనుంది. ఒడిశా, ఛత్తీసగఢ్‌తో కలిపి 397 గిరిజన, ఆదివాసీ గ్రామాలు పోలవరంలో కొట్టుకుపోనున్నాయి. ఇంత విధ్వంసం చేసే ప్రాజెక్ట్ వల్ల ఏమి వస్తుందని ప్రశ్నిస్తే..?! కష్ణా డెల్టాకు అదనంగా 80 టీఎంసీల నీరు! దానిలో కూడా కర్ణాటక, మహారాష్ట్రకు సగం వాటాపోగా.. మిగిలిన 45 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చిన్న లాభానికి పెద్ద విధ్వసం అన్నది తేలిపోతున్నది. ఇప్పటికైనా పాలకులకు కనీస విచక్షణ ఉంటే పోలవరం డిజైన్‌ను మార్చి ప్రాణ, ఆస్థి నష్టాన్ని నివారించాలని నిపుణులు హితవుపలుకుతున్నారు.
రిటైర్డ్ ఆంధ్ర ఇంజనీర్ హనుమంత రావు గారి బుక్ చదవండి!
ప్రస్తుతమున్న డిజైన్ కరెక్ట్ కాదు డిజైన్ మార్చాల్సిందే అని చెప్తున్న బుక్ చదవండి!
https://docs.google.com/file/d/0B87EmZE2LcX_LU1TdGNRX1Zydms/edit?pli=1
ఎందుకు పోలవరం కట్టగుడదో తెలుసు కోవాలంటే ఇది చదవండి! ఇది రాజకీయ సమస్య కాదు! నిరాశ్రయులవుతున్న గిరిజనుల సమస్య! కనమరుగు కానున్న పాపి కొండల సమస్య ! కొట్టుకు పోబోయే బద్రాద్రి రాముడి సమస్య! మునిగిపొనున్న మీ సీమాంధ్ర పట్టణాల సమస్య! మానవత దృక్పథం తో ఆలోచించాల్సిన సమస్య!
Why  must not be built! Please Read it!
http://agrariancrisis.in/wp-content/uploads/2014/05/IndiasDamShame-WhyPolavaramDammustnotbebuilt-2006.pdf
Polavaram-Ordinance

India’s Dam Shame: Why Polavaram Dam must not be built

By Tony Stewart  and V Rukmini Rao
download India’sDamShame-WhyPolavaramDammustnotbebuilt-2006
a must read for all those who want to understand the issues with